Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బ్రాడ్‌కు జరిమానా..!

Stuart Broad fined for abusive sendoff to Rishabh Pant

నాటింగ్‌హామ్‌: ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్‌కు ఐసిసి అధికారులు జరిమానా విధించారు. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత వేశారు. దీనికి కారణం అతడు పంత్ పై నోరు పారేసుకోవడమే. ఆదివారం రెండో రోజు ఆటలో 92వ ఓవర్ లో బ్రాడ్ వేసిన బంతికి రిషబ్ ఔట్ కావడంతో పెవిలియన్ కు వెళ్తున్నాడు. ఆ సమయంలో బ్రాడ్.. పంత్ వైపు చూస్తూ ఏదో దూషించాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. అది గమనించిన మ్యాచ్ రిఫరీ దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బ్రాడ్‌ను ప్రశ్నించగా తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. బ్రాడ్ నేరాన్ని ఒప్పుకోవడంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీసేన ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఐదో రోజు ఒక వికెట్ తీస్తే చాలు.. భారత్ ఖాతాలో విజయం చేరుతుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Comments

comments