Home తాజా వార్తలు ఎటిఎంలలో చోరీ: విద్యార్ధి అరెస్ట్…

ఎటిఎంలలో చోరీ: విద్యార్ధి అరెస్ట్…

Student arrested for robbery inside ATM centre in balapur

బాలాపూర్: ఎటిఎంలలో చొరీలకు యత్నిస్తున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్ధిని అరెస్టు చేసిన ఘటన మీర్‌పేట్ క్రైం పొలీసు స్టేషన్ లో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… జోగులాంబ గద్వాల జిల్లా లీజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన గొల్ల శ్రావణ్ (22) మీర్‌పేట్ గ్రామంలోని ఆర్‌ఎన్ రెడ్డి నగర్ పరిధిలోగల టికెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోగల ఆరెంజ్ బాయ్స్ హాస్టల్‌లో వసతి పొందుతూ… ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా టికెఆర్ కళాశాల వద్ద గల యాక్సిస్ బ్యాంక్ ఎటిఎంతో పాటు నవంబర్ 5వ తేది సరూర్‌నగర్ పరిధిలోని  ఇదే బ్యాంక్ ఎటిఎంలో సైతం చోరీకి యత్నించాడు. ఎటిఎం నిర్వహకుల ఫిర్యాదుతో సిసి కెమెర ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పొలీసులు శ్రావణ్‌ను నిందితుడిగా గుర్తించి డిఐ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో గురువారం అరెస్టు చేసిన్నట్టు ఇన్‌స్పెక్టర్ నర్సింగ్ యాదయ్యగౌడ్ తెలిపారు.

Student arrested for robbery inside ATM centre in balapur

Telangana Latest News