Home జనగామ ఫ్రెండ్స్ కొట్టారని విద్యార్థి బలవన్మరణం…

ఫ్రెండ్స్ కొట్టారని విద్యార్థి బలవన్మరణం…

Suicideజనగామ: జిల్లాలోని వీవర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన సాయి ప్రసాద్ అనే విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు కొట్టడంతో అవమానం జరిగిందని, అందుకే చనిపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు సాయిప్రసాద్ శవంతో అతడి స్నేహితులు ఇంటి ముందు ధర్నాకు దిగారు. తన కుమారుడిని కొట్టినవారిని అరెస్ట్ చేయాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎసిపి వినోద్ కుమార్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకుని నిందితులకు శిక్షపడేలా చేస్తామని పోలీసులు సాయి ప్రసాద్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Student Commits Suicide on Railway Track At Jangaon