Thursday, April 18, 2024

మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించిన పరిక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్తాపం చెంది పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా సూరారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు శనివారం సురారం గ్రామానికి చెందిన సిలగాని రమేష్ మమతలకు ఇద్దరు సంతానం. కుమార్తె హాసిని (15) హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ (ఐపీఎస్) లో హాస్టల్ లో ఉంటూ పదోతరగతి చదువుతోంది.

పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించే పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని కొద్ది రోజులుగా మనస్తాపానికి గురైందని, సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అనంతరం తిరిగి పాఠశాలకు వెళ్ళాలని తల్లిదండ్రులు సూచించడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందిదని తెలిపారు. ఘటనాస్థలాన్ని ఎస్సై జక్కుల పరమేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News