Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

శేరిలింగంపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య

Student Committed Suicide at Serilingampallyహైదరాబాద్ : శేరిలింగంపల్లిలో హర్షిత (21) అనే విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్ 15వ అంతస్తు నుంచి దూకి హర్షిత ఆత్మహత్యకు పాల్పడింది వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన హర్షిత హెచ్‌సియులో సిస్టమ్స్ బయాలజీలో ఎంఎస్‌సి రెండో సంవత్సరం చదువుతోంది. అయితే హర్షిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చందానగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన హర్షిత ఇక్కడికొచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం హర్షిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Student Committed Suicide at Serilingampally

Comments

comments