Search
Saturday 17 November 2018
  • :
  • :

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

Student died with Electrocution at Kamayyapeta

విశాఖ : విద్యుదాఘాతంతో భారతి అనే ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి చెందింది. మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన హుకుంపేట మండలం కామయ్యపేట ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉదయం జరిగింది. పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ తీగలను గమనించని భారతి, మరో విద్యార్థినికి ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Student died with Electrocution at Kamayyapeta

Comments

comments