Search
Saturday 17 November 2018
  • :
  • :

సాంబారులో పడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి

Boy1

కట్టంగూర్: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఈదులూరు ప్రాథమిక పాఠశాలలో ప్రమాదవ శాత్తూ సాంబాలో పడి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందు తున్న విద్యార్థి బల్గూరి జయవర్దన్ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పాఠశాల వి ద్య డైరెక్టర్ జి. కిషన్, నల్లగొండ ఎంఎల్‌సి పూల రవీందర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా అసుపత్రికి వెళ్లి, సంఘటన జరిగిన తీరును ఎంఈవో చంద్రారెడ్డి, విద్యార్థి తల్లిదండ్రు లను అడిగి తెలుసుకున్నారు. కాగా, విధులపై నిర్లక్షం వహించి, విద్యార్థి మృతికి కారకులైన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమ, తరగతి ఉపాధ్యా యుడు మురళీకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లును ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

Comments

comments