Home తాజా వార్తలు కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతి

Student Dies With Current Shock in Medak District

చిన్నశంకరంపేట: కరెంట్ షాక్‌తో డిగ్రీ చదువుతున్న విద్యార్థి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం పరిధిలోని శాలిపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ సింగిల్ ఫేజ్ మోటారు వద్ద మంచినీరు తేవడానికి గ్రామానికి చెందిన బండారు సుదర్శన్(18) వెళ్లి నీటిని పట్టుకున్న తర్వాత స్టాటర్‌ను ఆఫ్ చేస్తున్న క్రమంలో కరెంట్ పాసై షాక్ రావడంతో సృహ తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే నార్సింగి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.