Search
Wednesday 14 November 2018
  • :
  • :

పెద్దసారు జర సూడు… ఉపాధ్యాయులు బడిబయట…పనిలో విద్యార్థులు

Student

తాంసి : గిరిజన విద్యా ర్థులపై చిన్నచుపో…? లేదా అధికారుల పర్యవే క్షణ కరువో…?మండలంలోని గిరి గూడెల్లో పాఠశాలలు సమయానికి తెరుచు కోవడం లేదు. దీంతో గిరిజన విద్యార్థులకు చదువు అందని ద్రాక్షలాగా మారుతుందని చెప్పాచ్చు. మండలంలోని గిరిగాం గ్రామ పంచా యతీ పరిధిలో గల అట్నంగూ, లీంగూ డ పాఠశాలలు బుధవారం 10 దాటిన తెరవ కపోవడంతో విద్యార్థులు కూరగా యాలు అమ్మేందుకు అట్నంగూడకు వేళ్తున్న సంఘటనలు మన తెలంగాణ దృష్టికి రావడ ంతో వారి చిత్రాలను తీసింది.

దీనిపై విద్యా ర్థులను ఆరా తీయగా సార్లు రారు…మాకు చదువు సక్రమంగా చెప్పరు అంటు సమా దానం ఇచ్చారు. సంబంధిత ఉపాధ్యా యులపై చర్యలు తీసుకునేందుకు అధి కారులు ముందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు ఆదిలాబాద్ జిల్లాలో పటిష్టంగా ఉండడం, ప్రతిఉపాధ్యాయుని మంత్రి నుంచి మంచి సంబంధాలు ఉండడంతో వారిపై చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు, సంఘాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఉపాధ్యాయులు సమయ పాలన పాటించే విధంగా చూడాలని ఆయా గిరిగ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

comments