Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

టీచర్ నిర్వాకంతో విద్యార్థినికి నరకయాతన..!

Student--head-stuck-between

ఆగ్రా: ఆగ్రా నగరానికి 80 కి.మీ. దూరంలో ఉన్న బాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోబాయి గ్రామంలో దారుణ సంఘటన జరిగింది. ఓ ఉపాధ్యాయుని నిర్వాకంతో ఎనిమిదేళ్ల విద్యార్థిని తరగతి గది తలుపులో తల ఇరుక్కుపోవడంతో దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది.

ఘటన వివరాల్లోకి వెళితే…  ధోబాయి గ్రామానికి చెందిన సాక్షి (8) అనే బాలిక స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక చేసిన తప్పేంటో తెలియదు కాని సదరు టీచర్ మాత్రం చాలా పెద్ద శిక్షే విధించారు. తరగతి గదిలోని తోటి విద్యార్థులను బయటకు పంపించి సాక్షిని మాత్రం లోపలే ఉంచి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దాంతో భయపడిపోయిన బాలిక ఎలాగైన తప్పించుకోవాలనే ఆత్రుతలో తలుపుల సంధుల్లోంచి బయటకు వెళ్లేందుకు యత్నించింది.

అయితే శరీర భాగం మొత్తం బయటకు వచ్చి తల మాత్రం తలుపుల సంధులో ఇరుక్కుపోయింది. అలాగే దాదాపు రెండు గంటలపాటు ఉండిపోయింది. దాంతో బాలిక భయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి విద్యార్థిని బయటకు తీశారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది.

Student’s head was stuck for nearly two hours between the doors of her classroom.

Comments

comments