Home మంచిర్యాల విద్యార్థులే కూలీలుగా

విద్యార్థులే కూలీలుగా

బియ్యం సంచులను మోసిన చిన్నారులు
పట్టింపు లేని విద్యాశాఖ అధికారులు

Student-is-Labour

మంచిర్యాలటౌన్: పలక బలపం పట్టాల్సిన చిన్నారి చేతులు తమకు సాధ్యంకాని బియ్యం బస్తాలను తరలించేందుకు కూ లీల అవతారం ఎత్తారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉన్న  ఆవరణం లోనే చిన్నారి విద్యార్థులతో కూలీ పనులు చేయించిన సంఘటన శని వారం మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో నిల్వ ఉన్న బియ్యం సంచులను మరో ప్రాంతా నికి తరలించేందుకు వచ్చిన వ్యక్తులు విద్యార్థులతో వాటిని మోయిం చడం   గమనార్హం. సుమారు 6 క్వింటళ్ల బియ్యం బస్తాలను  విద్యార్థు లు తరలిస్తున్నప్పటికి ఉపాధ్యాయులు స్పందించకపోవడంపై విమర్శ లు  తలెత్తాయి.

జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారి ఉన్న పాఠశాల ఆవరణలోనే  విద్యార్థులతో చేపిస్తున్న పనులపై విద్యార్థి సం ఘాల నాయకులు రాంశెట్టి నరేందర్, మామిడాల ప్రవీణ్, జాగిరి రాజేష్, యుసూఫ్, శ్రీ నివాస్‌లు ప్రశ్నించినప్పటికీ  బియ్యం తరలించే వ్యక్తుల నుండి సరైన సమాదానం రాలేదు. విద్యార్థులు పని చేస్తున్న  సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా పాఠశాలలో లేకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు.  ఈ విష యంపై జిల్లా కలెక్టర్ స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరారు.  అదే విధంగా పాఠశాల ముందు  జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్ష ణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.