Search
Wednesday 14 November 2018
  • :
  • :

అగర్తాలాలో దారుణం…!

Student Jumps Off School Building After Teachers Force Girl To Tie Rakhi

అగర్తాలా: త్రిపుర రాజధాని అగర్తాలాలో ఘోరం జరిగింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో రాఖీ కట్టించేందుకు ఉపాధ్యాయులు యత్నించడంతో ఓ యువకుడు పాఠశాల భవనం నుంచి దూకేశాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన వివరాల్లోకి వెళితే… స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో దిలీప్ కుమార్ షా(18) అనే యువకుడు పన్నెండో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఓ అమ్మాయిని దిలీప్ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఆమెతో దిలీప్‌కు రాఖీ కట్టించేందుకు యత్నించారు. యువతిని బలవంతంగా దిలీప్ వద్దకు తీసుకువచ్చి రాఖీ కట్టాలంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన యువకుడు పాఠశాల భవనంలోని రెండో అంతస్తు నుంచి దూకేశాడు. దాంతో దిలీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన అక్కడి వారు వెంటనే దిలీప్ ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా అన్యాయంగా తమ కుమారుడిని బెదిరింపులకు పాల్పడిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసనకు దిగారు. పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments