Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

school-మరొకరికి తీవ్రగాయాలు
మనతెలంగాణ/గద్వాల అర్బన్: అతివేగంగా వెళ్తున్న బొలేరో వాహనం బలంగా ఢీకొట్టడంతో ఒవ విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందగా, మరొక విద్యార్థిని తీవ్రంగా గాయపడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండంలోని వీరాపురం వద్ద చోటుచేసుకుంది. వివరాలు… వీరాపురం గ్రామానికి చెందిన రాధ (15 సంవత్సరాలు) పదవ తరగతి, రాణి (12 సంవత్సరాలు) ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులు రోజు మాదిరి వీరాపురం స్టేజి దగ్గర రోడ్డును దాటుతుండగా అదే సమయంలో హైదారాబాదు నుంచి గద్వాల వైపు వస్తున్న బొలేరో వాహనం వేగంగా వచ్చి ఇద్దరు విద్యార్థులను ఢికొట్టింది. ఈప్రమాదంలో పదవ తరగతి చదువుతున్న రాధ అక్కడిక్కడే మృతి చెందగా, రాణి తీవ్రంగా గాయపడింది. వీరిని చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ్లకృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పీసీసీ కార్యదర్శి గడ్డంకృష్ణారెడ్డిలు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన రాణికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. అధేవిధంగా ప్రమాదం జరిగిన చోట వేగనిరోధకాలను డ్రమ్ములను ఏర్పాటు చేశారు. మృతిచెందిన రాధ తల్లి ఏడాదిన్నర కిందట మృతి చెందటం అంతలోనే కుటుంబంలో కూతురు మృతిచెందడంతో తండ్రి లక్ష్మన్న కన్నీరుమున్నీరైయ్యారు.

Comments

comments