Home జాతీయ వార్తలు నోయిడాలో నల్లగొండ విద్యార్థి దారుణ హత్య

నోయిడాలో నల్లగొండ విద్యార్థి దారుణ హత్య

Dead-in-nodiaన్యూఢిల్లీ / నల్లగొండ: ఢిల్లీ సమీపంలోని నోయిడాలో చదువుకుటుంటున్న నల్లగొండ జిల్లా శ్రీనగర్ కాలనీకు చెంది న సందేశ్ అనే విద్యార్థి తన మిత్రుడి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు నిందితులు కలిసి తుపాకీతో కాల్చడమే కాకుండా గొడ్డలి తో విచక్షణా రహితంగా నరికి సందేశ్‌ను పొట్టనబెట్టుకున్నారు. నోయిడాలోని అమెటీలో బిఎస్‌సి మెరైన్ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్న సందేశ్ అక్కడ లోటస్ బోర్ వార్డు అనే అపార్ట్‌మెంట్‌లోని 1804 పోర్షన్‌లో అద్దెకు ఉంటున్నాడు. అమన్, సందేశ్ ఇద్దరు గతంలో మంచి మిత్రులు. అమన్ టూరిజం మేనే జ్‌మెంట్ కోర్సు చేస్తున్నా డు. ఇద్దరి కోర్సులు వేరై నా ఇద్దరి మధ్య మంచి స్నేహంఏర్పడింది. కొంత కాలం కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు కూడా. మనస్ప ర్థలు వచ్చి ఇటీవలే విడి పోయారు. శనివారం మధ్యాహ్నం ముడున్నర గంటల సమయంలో అమన్ తన స్నేహితుడు మౌంటీని వెంటబెట్టుకొని సందేశ్ ఉండే అపార్ట్‌మెంట్‌కు వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసిన వెంటనే వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం గొడ్డలితో విచక్షణారహితంగా ఎక్కడపడితే అక్కడ నరికాడు. కుప్పకూలిన సందేశ్ అక్కడికక్కడే ప్రాణలు విడిచాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న నదీమ్ పక్కగదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. మరో రూంమేట్ మాథుర్ పాల ప్యాకెట్ కొనేందుకు బయటకు వెళ్లడంతో ఆయనకు కూడా ముప్పు తప్పింది. ఎలాగైన సందేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్న అమన్ తన వెంట మరో మిత్రుడిని వెంటబెట్టుకొని రావడమే కాకుండా ఒక గొడ్డలిని కూడా తెచ్చుకున్నాడు. ఒక వేళ నాటు తుపాకీ పేలకపోతే గొడ్డలితోనైనా నరికి చంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం పారిపోతూ గొడ్డలిని ఘటనా స్థలిలోనే వదిలేశాడు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ఒకప్పుడు తనకు మంచి స్నేహితుడిగా ఉన్న సందేశ్‌ను అమన్ ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దుర్వార్త తెలిసిన వెంటనే మృతుడి తండ్రి శ్యాంసుందర్ ఢిల్లీకి బయలుదేరారు.