Home తాజా వార్తలు టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి

టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి

Teacher

 

ఛండీగఢ్: హర్యానా రాష్ట్రం సోనిపేట ప్రాంతం భిగన్ గ్రామంలో టీచర్‌పై ఓ విద్యార్థి కతితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వేసవి సెలవులు అయిపోగానే స్కూళ్లు తెరుచుకున్నాయి. శ్రీరామ్ స్కూల్‌లో పని చేస్తున్న ఆంగ్లం టీచర్ ముకేశ్ కుమారి పదకొండో తరగతిలోకి వెళ్లి హోంవర్క్ చేశారా అని విద్యార్థులను అడిగింది. హోంవర్క్ చేయని ఓ విద్యార్థి సదరు టీచర్ కడుపులో కత్తితో పొడుస్తుండగా చేతిని అడ్డుపెట్టింది. దీంతో ఎడమ చేతిపై నాలుగు చోట్ల కత్తి పోట్లు పడ్డాయి. అనంతరం విద్యార్థి పారిపోతుండగా మరో టీచర్ పట్టుకున్నాడు. తీవ్రంగా గాయపడిన టీచర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి సదరు విద్యార్థిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

 

Student Stab Teacher Stomach in School in Haryana