Home తాజా వార్తలు ఇంటర్ ఫెయిల్… విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ ఫెయిల్… విద్యార్థిని ఆత్మహత్య

Suicide

 

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ విద్యార్థిని ఇంటర్ ఫెయిల్ కావడంతో  ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  కోఠిలోని ప్రగతి కాలేజీలో అనమిక (16) అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడంతో సదరు విద్యార్థిని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Student Suicide with Fail in Intermediate in Hyderabad