Home ఎడిటోరియల్ విద్యార్థి యూనియన్ ఎన్నికలు ప్రజాస్వామిక హక్కు

విద్యార్థి యూనియన్ ఎన్నికలు ప్రజాస్వామిక హక్కు

quadr2iవిద్యార్థి దశలో రాజకీయాలనుంచే జాతీయో ద్యమంలో మహానాయకులు ఉద్భవించారు. అప్పు డైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా విద్యార్థిదశలో జరిగే రాజకీయ చర్చలు, చేపట్టే కార్యకలాపాలే దేశానికి భవిష్యత్ నాయకత్వాన్ని అందించ గలుగుతాయి. విద్యార్థి వయోజనుడుగా మారుతున్న ఆ వయస్సులో ఏర్పరుచుకున్న విద్యా విషయక పరిజ్ఞానం, జాతీయ, అంతర్జాతీయ స్థితిగతుల గూర్చిన అవగాహన అతని భవిష్యత్ జీవన గమనాన్ని, ఆలోచనా ధోరణిని ప్రభావితం చేస్తుంది. కాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్థి యూనియన్ ఎన్నికలు, వాటిలో పనిచేయటం నాయకత్వ లక్షణాలను సమకూరుస్తుంది. అయితే దురదృష్టవశాత్తు, బయటి రాజకీయ వ్యవస్థలోని నేరస్వభావాలు, రాజ్యాంగే తర ఆచరణలు విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించి వాటి ప్రజాస్వామిక స్వభావానికి భంగం కలిగిం చాయి. కొన్ని యూనివర్శిటీల్లో జరిగిన కొన్ని ఘటనలను అనువుగా తీసుకుని ప్రభుత్వం యూనియన్ ఎన్నికలనే నిషేధించింది.

దేశంలో 10 ఏళ్ళుగా ఎన్నికలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో (ప్రస్తుత తెలంగాణ కలుపుకుని) 27ఏళ్లుగా విద్యార్థి యూనియన్ ఎన్నికలు లేవు. క్యాంపస్ రాజకీయాల్లో ప్రకోపించిన రాజకీయ ఉన్మాదం, డబ్బు ప్రవాహం, ఆగ్రహావేశాలు గమనిం చిన సుప్రీంకోర్టు, నాటి క్యాంపస్ రాజకీయాలను ఆవహించిన జబ్బేమిటో కనుగొని, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఒక కమిటీని నియమిం చాల్సిం దిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను ఆదేశించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జెఎం. లింగ్డో ఛైర్మన్‌గా 2005లో నియమించిన కమిటీలో ప్రొఫెసర్ జోయా హసన్, డాక్టర్ ప్రతాప్ భాను మెహతా, ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్, ఐ.పి.సింగ్ , ప్రొఫెసర్ దయానంద్ డోంకాంకర్ సభ్యులు. కమిటీకి నివేదించిన పరిశీలనాంశాలు : 1) విద్యార్థి ఎన్నికల్లో క్రిమినలైజేషన్, 2) ఆర్థిక పార దర్శకత, ఎన్నికల ఖర్చుపై పరిమితి, 3) పోటీ చేయ దలచిన అభ్యర్థుల అర్హత 4) ఎన్నికల నిర్వహణలో ప్రొసీజర్‌ను పాటించటం, అభ్యర్థుల అర్హతలు, నియమాలు పాటించకపోవటానికి సంబం ధించి విద్యార్థి ఎన్నికల్లో తలెత్తే ఫిర్యాదులను, వివాదాలను పరిశీలించే వేదిక ఏర్పాటు.

యూనివర్శిటీ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని, విద్య బోధించటం యూనివర్శిటీ ప్రాథమిక విధి అని, విద్యాసంస్థల్లో రాజకీయ సిద్ధాంత బోధ అవసరంలేదని లింగ్డో కమిటి నివేదిక వ్యాఖ్యానించింది. దాని ముఖ్యమైన సిఫారసులు ఇలాఉన్నాయి. 1)అభ్యర్థి ఎన్నికల వ్యయం గరిష్ట పరిమితి రూ.5000. 2) ప్రచారం కొరకు పోస్టర్లు, కరపత్రాలు సహా ఎటువంటి ముద్రిత సామాగ్రిని అనుమతించరాదు. 3) ఎన్ని కలు సంవత్సరం ప్రాతిపదికపై జరగాలి. విద్యా సంవత్సరం మొదలైన 6-8 వారాల్లో ఎన్నికలు జరపాలి. 4)విద్యార్థి ఎన్నికలకు రాజకీయ పార్టీల నుంచి నిధుల ప్రవాహాన్ని నిరోధించే నిమిత్తం, విద్యార్థులనుంచి ఐచ్ఛిక విరాళాలు మినహా ఏ ఇతర వనరులనుంచి నిధులను అభ్యర్థు లు ఉపయో గించటంపై నిషేధం. 5) ఎన్నికల్లో పోటీచేసే సంవ త్సరంలో అభ్యర్థులు అకడమిక్ బకాయీలు ఉండరాదు 6) 75శాతం హాజరు లేదా యూని వర్శిటీ నిర్దేశించిన కనీస హాజరు, రెంటిలో ఏది ఎక్కువైతే అది అభ్యర్థికి ఉండాలి. 7) రీసెర్చి విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 28 సంవత్స రాలు. 8) కేంద్ర, రాష్ట్ర లేదా యూనివర్శిటీ చట్టాల ప్రకారం విద్యార్థి ప్రాతినిధ్యాన్ని రెగ్యులేట్ చేయాలి.

జాతీయస్థాయిలో విద్యార్థి రాజకీయాలు, నేరాలు, రాజకీయాల మధ్యబంధం మితిమీరిన దృష్టా ఈ సంస్కరణలు అవసరమని కమిటీ భావిం చింది. సమాజం మెరుగుదలకై యువత రాజ కీయాల్లో సానుకూల మార్గంలో నిమగ్నులు కావా లని ఆశించింది. అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ (ఎఐఎస్‌ఎఫ్) ఈ నివేదికలో కొన్ని మార్పులు కోరు తున్నది. అది అట్లుంచి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో విద్యార్థి యూనియన్ ఎన్నికలపై నిషేధం ఎత్తివేయా లని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నది. ప్రభు త్వాలు గనుక సానుకూలంగా ముందుకు రాకపోతే హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తుంది.

సయద్ వలీఉల్లాఖాద్రి
ఎఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు