Search
Wednesday 26 September 2018
  • :
  • :

విద్యార్థులే అధ్యాపకులు

teachersమన తెలంగాణ/ హైదరాబాద్:  ఉన్నత విద్యా శాఖ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న వారి చేత మన టివి ద్వారా పాఠాలు చెప్పిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా తొట్టతొలుత గజ్వేల్ డిగ్రీ కాలేజీ విద్యార్థి రాజు బోధించిన మన రాష్ట్రపతి అనే పాఠాన్ని 10వ తేదీన ప్రసారం చేశారు. ప్రభుత్వ కాలేజీ లు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏ మాత్రం తీసి పోవని, వీటిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు కొదవ లేదని, వారిలో నిగూఢమై ఉన్న ప్రజ్ఞా పాటవాలను వెలికి తీయడంలో భాగంగా ఈ కార్యక్రమానికి రూప కల్పన చేశారు. ఈ విధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువు తున్న చురుకైన, విషయ పరిజ్ఞానం కలిగిన వారితో మన టీవి ద్వారా తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఈ ఆలోచన రావడమే ఆలస్యం, దీనిని కార్యరూపంలో పెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కమి షనర్ వాణీప్రసాద్ ఇందుకు సంబంధించి అధికారులు, ప్రధానాచార్యులకు మార్గనిర్దేశనం చేశారు.

మన టీవి ద్వారా తోటి విద్యార్థు లకు పాఠాలు బోధించేందుకు గాను ప్రతిభ కలిగిన వారిని గుర్తించాల్సిందిగా కోరారు. మొత్తం 14 సబ్జెక్టు ల్లో బోధనా కార్యక్రమం ఉంటుందని, ఆ యా అంశాల లో ప్రతిభ కనబర్చే వారిని ఎంపిక చేయాల్సిందిగా సూచించారు. ఈ విధంగా మొట్ట మొదట 500 మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్ష పెట్టి, వీరిలో 100 మందిని, చివరగా 42 మందిని ఎంపిక చేశారు. విషయ పరిజ్ఞానం, హావభావాలు, బోధనా పటిమ తదితర అంశాల ఆధారంగా వీరి ఎంపిక జరిగింది. ఈనెల 10న మొదట గజ్వేల్ కళాశాలలో రాజనీతి శాస్త్రం తృతీయ సంవత్సరం చదువుతున్న రాజు పాఠం చెప్పి, ఇటు విద్యార్థులు, అటు అధ్యాపకులు, అధికారుల ప్రశంసలకు పాత్రులయ్యారు.

ఈ విధంగా టీవి ద్వారా పాఠాలు బోధించిన విద్యార్థులకు తలా 2,000 రూపాయల చొప్పున పారితోషకంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ఈ క్రమంలో ఈనెల15వ తేదీన సిటీ కాలేజీ విద్యార్థిని శ్రావణి తెలుగుపాఠం ప్రసారం కానున్నది. ఈ సందర్భంగా వాణీప్రసాద్ మన తెలం గాణతో మాట్లాడుతూ, విద్యార్థులలో నిగూఢమై ఉన్న ప్రతిభ పాటవాలను వెలికితీయడం, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించడం, పోటీ ప్రపంచంలో అవకాశాలను అంది పుచ్చుకోవడమే ప్రధానోద్దేశాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ రంగంలోని కాలేజీలు ఏ మాత్రం తీసిపోవని అందరు అర్థం చేసుకుంటారని అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

Comments

comments