Search
Thursday 15 November 2018
  • :
  • :

ఫీజులుం సహించం

kadiyam

ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు, వచ్చే ఏడాదికి ముందుగానే బోధనా రుసుములు చెల్లిస్తాం : కడియం శ్రీహరి

మన తెలంగాణ/ వరంగల్ :  2016 విద్యాసంవత్సరానికి సంబంధించిన బోధనా రుసుములను కాలేజీ యాజమాన్యాలకు ముందుగానే చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఫీజుల కోసం విద్యా ర్థులను వేధించవద్దని, ఎవరైనా వేధించినట్టు ప్రభుత్వం దృష్టికి వస్తే ఆయా కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారంనాడు జిల్లాలోని హసన్‌పర్తి మండలం భీమారంలో ప్రైవేట్ జూని యర్ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యపై నిర్వహిం చిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ బోర్డులో అవినీతిని పెంచి పోషించింది ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అవినీతి కార్యకలాపాలకు చెల్లుచీటీ ఇచ్చేందుకు త్వరలో బోర్డులో ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురానున్నట్టు మంత్రి వెల్లడించారు. గత ప్రభు త్వాలు రూ.2500 కోట్ల్ల బాకాయిలు పెండింగ్‌లో ఉంచాయని, తెలంగాణ ఏర్పడిన తరువాత తమ ప్రభు త్వం ఆ బకాయిలన్నింటిని వెంటనే చెల్లించిందని గుర్తు చేశా రు. అలాగే రూ.900 కోట్లు కుడా రియింబర్స్‌మెంట్ కూడా చె ల్లించా మని తెలిపారు. ఆర్‌టిఎ కార్యాలయాల్లో ఎలాగైతే బ్రోకర్లు ఉంటారో గతంలో ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు అలాగే ఉండేవని, కానీ తాను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బ్రోకర్ల మాటే లేకుండా చేశానన్నారు. ఇంటర్ బోర్డులో అవినీతి, వేధింపులు ఉంటే ఒక్క ఎస్ ఎంఎస్ చేయాలని, దర్యాప్తు జరిపి అలాంటి అధికారుల భరతం పడతామని మంత్రి స్పష్టం చేశారు.
బోర్డు అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారు : నరేందర్‌రెడ్డి
మంత్రి కడియం శ్రీహరి ప్రసంగించడానికి ముదు తెలంగాణ ప్రైవే టు కళాశాల యాజమాన్యం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేం దర్‌రెడ్డి సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో సుమారు లక్ష కుటుంబాలు ప్రైవేటు జూనియర్ కళాశాలలపై అధారపడి జీవిస్తు న్నాయని అన్నా రు. ఇంటర్‌బోర్డు అధికారులు లంచాల కోసం తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్ంత చేశారు. కెజి టు పిజి విద్య ప్రవేశపెడితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పాకిస్తాన్ పౌ రులలాగా ప్రైవేటు కళాశాల యాజామాన్యాలను చూస్తున్నారని అన్నారు. వెంటనే ఫీజు రియిం బర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల ని కోరారు. పెండింగ్‌లో ఉన్న కళాశాల గుర్తింపులను వెంటనే ఇవ్వాలని కోరారు.

Comments

comments