Home నల్లగొండ విద్యుదాఘాతం..విధివంచితం

విద్యుదాఘాతం..విధివంచితం

Students Dies With Current Shock In Nalgonda Dist

విధివంచించింది..కాలం కాటేసింది..రెండు నిండు ప్రాణాలకు నూరేళ్ళు నిండా యి..అత్యంత హృదయ విదారకమైన సంఘటన జిల్లా కేంద్రమైన నల్లగొండ బీటి ఎస్ రహమత్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఈదురుగా లులతో కూడిన వర్షం కురిసిన నేపధ్యంలో విద్యుదా ఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడబుట్టిన అన్నదమ్ములు పేర్ల శ్రీనివాస్(24), పేర్ల ఆనంద్ కుమార్ (19) అక్కడికక్కడే అసువులుబాశారు. ఒకరు ఉన్నత చదువు చదివారు, మరొకరు చదువుతున్నాడు ఇద్దరూ మంచి యోగ్యతతో కుటుంబంలో వెలుగులు నింపుతారని ఆ వయస్సు మీదపడిన తల్లిదండ్రులు పడ్డ ఆశలు అడియాశలయ్యాయి.

మనతెలంగాణ/నల్లగొండ ప్రతినిధి ః విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పేర్ల శ్రీనివా స్(24), పేర్ల ఆనంద్‌కుమార్(19) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలొదలడంతో విషాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన పేర్ల శేఖర్ కుటుంబం కూలీనాలీ చేసుకొని బతుకుదెరువు కోసం జిల్లా కేంద్రంలోని బీటీఎస్ ప్రాంతంలో రహమత్‌నగర్ దాదాపు పది హేనేళ్ళ క్రితం ప్రభుత్వం సహకారంతో ఇళ్ళు నిర్మించుకొని జీవన సాగిస్తున్నారు. శుక్ర వారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో బయట పండుకున్న వీరు అంతా కలిసి లోనికి వెళ్ళి మళ్ళీ నిద్రకు ఉపక్రమించే లోపే గాలిదుమారంతో కూడిన వర్షం వల్ల ఇంటి విద్యుత్ మీటర్‌కు సపోర్టుగా ఉన్న జేవైర్ సపోర్టుతో ఉన్న సర్వీసు వైర్‌ను సరిచేసే క్రమంలో శ్రీనివాస్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. షాక్‌తో శ్రీనివాస్ అరువగా తమ్ము డు ఆనంద్ వచ్చిచూసి అన్నను కాపాడబోయి పట్టుకున్నాడు. దీంతో ఇద్దరు విద్యుదా ఘాతంలో కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందారు.
బతుకుదెరువు కోసం వచ్చి
తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన పేర్ల శేఖర్, వెంకటమ్మ కుటుంబం బతుకుదెరువు కోసం నల్లగొండకు వచ్చి కూలీనాలీ చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. చనిపోయిన వారిలో పెద్దవాడు శ్రీనివాస్ బీటెక్ పూర్తిచేయగా, ఆనంద్‌కుమార్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం కొనసాగిస్తున్నాడు. ఇక అమ్మాయి వెన్నెల ఇంటర్మీడియట్ చదువుతోంది, కాగా పిల్లలు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, ఆనంద్ ఇంటర్మీడియట్‌లో ర్యాంకు సాధించినట్లు బందువులు తెలియజేస్తున్నారు.
పజ్జూరులో విశాదఛాయలు
మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించిన అనంతరం తిప్పర్తి మండలం పజ్జూరుకు అంత్యక్రియల కోసం తరలించగా గ్రామంలో విశాదఛాయలు అలుముకున్నాయి. అయితే అంతకు ముందు మార్చురీ వద్దకు వివిద రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతుల తల్లిదండ్రులను ఓదార్చారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మృతుల కుటింబీకులను ఓదార్చి వారికి రూ. లక్ష ఆర్దిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అదే విదంగా ప్రభుత్వం తరపున స్థానిక తహశీల్దార్ నాగార్జునరెడ్డి తక్షణ సహాయంగా రూ. 10లు అందించారు. ఇక తిప్పర్తి జడ్పీటీసి తండు సైదులుగౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూమి వ్యక్తం చేశారు. సీపీఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, కౌన్సిలర్‌లు సలీం, లతీఫ్, దండెంపల్లి సత్తయ్య తదితరులు మృతుల పట్ల సంతాపం , సానుభూతి ప్రకటించారు. ఇదిలా ఉంటే పజ్జూరులో జరిగిన అంత్యక్రియ ల కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ టిఆర్‌స్ ఇన్‌చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డిలు సంతాపం ప్రకటించి సానుభూతి తెలియజేశారు. ఈ సందర్బంగా కంచర్ల భూపాల్‌రెడ్డి బాధిత కుటుంబానికి రూ. 2లక్షల ఆర్దికసహాయం ప్రకటించారు.