Home కుమ్రం భీం ఆసిఫాబాద్ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరం

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరం

ka

ఆసిఫాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. బుధవారం పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో పాఠశాల విద్యార్థులు అఖిల భారత క్యారమ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుంటూ క్రీడల్లో రాణించాలని, జాతీయస్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. అఖిలభారత క్యారమ్ పోటీల్లో మూడవ స్థానంలో ప్రతిభ కనబర్చిన గణపతి, వెంకటేశ్‌లను పూలమాలలతో సన్మానించి అభినందించారు. అనంతరం తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ మాట్లాడుతూ పాఠశాలలో క్యారమ్‌బోర్డు లేకపోయిన నేషనల్‌స్థాయిలో ప్రతిభకనబర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనవంతుగా పాఠశాలకు క్యారమ్‌బోర్డులు అందిస్తానన్నారు. ప్రతిభకనబర్చిన విద్యార్థులకు రూ. 1000 నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు బొనగిరి సతీష్‌బాబు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా గ్రంథాయాల చైర్మన్‌లు కనక యాదవరావు, ప్రవీణ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గందం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఎంపిటిసి రవీందర్, ఎంఈఓ శంకర్, పాఠశాలప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్ పాల్గొన్నారు.