Home జాతీయ వార్తలు హస్తినలో కదంతొక్కిన విద్యార్థులు

హస్తినలో కదంతొక్కిన విద్యార్థులు

protestమనతెలంగాణ/ న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులకు గండి కొడుతూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణాయానికి వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదంతొక్కింది. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు నెట్ యేతర ఫెలోషిప్‌లు రద్దు చేస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది. దీనికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ సంయుక్తంగా యూజీసీ ప్రధాన కార్యాలయం నుంచి కేంద్రమానవ వనరుల మంత్రి శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. సుమారు రెండు వేల మంది విద్యార్థులు ర్యాలీ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ర్యాలీదా ముందుకు సాగారు. అయితే మధ్యలో ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహంతో శాంతియుతంగా సాగుతున్న ర్యాలీని అడ్డుకున్నారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. అయినా లెక్కచేయకుండా విద్యార్థులు కేంద్ర మానవ వనరు మంత్రి శాఖ కార్యాలయం వరకు చేరుకొని నిరసనగా ముఖద్వారానికి అడ్డుగా భైఠాయించారు. దీంతో దిగొచ్చిన హెచ్.ఆర్.డి మంత్రి స్మృతి ఇరానీ విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు. శనివారం చర్చలు జరగనున్నాయి.