Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

కష్టపడి చదువితేనే ఉన్నత శిఖరాలు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి

students read the hard work make good results the bright future

మన తెలంగాణ/ కొడకండ్ల : విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని టిఎస్ రెసి డెన్షియల్ పాఠశాలలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రారంభించడంతోపాటు రూ.2.40 కోట్లతో నిర్మిం చిన డార్మెంటరీ భవనంతోపాటు అదనపు తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ రెసి డెన్షియల్ సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల వాతావ రణాన్ని చూస్తే శాంతినికేతన్ నిలయాన్ని తలపిస్తుందన్నారు. నిరుపేదలకు మెరుగైన విద్య అందివ్వాలనే లక్షంతో ఎన్టీఆర్ ప్రభుత్వం హయాంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని, ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్షం మూలంగా విద్యావ్యవస్థ కుంటుపడటంతోపాటు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 35 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే రెండు పాఠశాలలను మాత్రమే అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 35 పాఠశాలల్లో ఇంటర్మీడియెట్‌కు అప్‌గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. భవనాలు, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో 35 రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ.116కోట్లతో వసతి కల్పించడం జరిగిందన్నారు. పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు విద్య కోసం పదేపదే నిధులు మంజూరు చేయాలని కోరగా మరో 10 రోజుల్లో ఈ పాఠశాలలో మరిన్ని తరగతి గదుల కోసం రూ.2 కోట్లను కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కేజీబీ, మైనార్టీ, బీసీ, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షల మంది బాలికలకు ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున రూ.100 కోట్లు వెచ్చించి హెల్త్ హైజీనిక్ కిట్స్‌ను అందివ్వడం జరుగుతుందన్నారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినిలకు కంటిపరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమన్నారు. తన కోరిక మేరకు పాఠశాలకు మరో రూ.2కోట్లు మంజూరు చేయడం పట్ల కడియం శ్రీహరికి పాలకుర్తి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో రమేష్, జెడ్పీటీసీ లలిత, ఎంపీపీ జ్యోతి, స్థానిక సర్పంచ్ విజయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రమాదేవి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, ప్రిన్సిపాల్ దయాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments