Search
Saturday 17 November 2018
  • :
  • :

విజయం సాధించడంలో విద్యార్థులు ముందుండాలి

క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించిన కమిషనర్
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం
Untitled-1దుబ్బాక: విద్యార్థులు విద్యాతో పాటు క్రీడాల్లో కూడా తమ విజయం సాధించాలని దుబ్బాక నగర కమిషనర్ భోగేశ్వర్, ఎంపిపి ర్యాకం పద్మ, ఎంఇఒ సిద్దిరాంరెడ్డి, ఎంపిడిఒ ప్రవీణ్‌లు అన్నారు. శనివారం మండల కేంద్రామైన దుబ్బాకలోని స్థానిక బీపిఈడి కళాశాల ఆవరణలో మండల స్థాయి క్రీడాలను వారు క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రతి విద్యార్థి విద్యాతో పాటు క్రీడాల్లో కూడా రాణించాలని వారు సూచించారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులు విజయం సాధించడంలో ముందుండాలని వారు పెర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే క్రీడల్లో 18 జిల్లా పరిషత్ పాఠశాలలు, 12 ప్రాథమిక ఉన్నత పాఠశాల, 14 ప్రైవేటు పాఠశాల అండర్ 14, అండర్ 17 విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొంటాన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయాడం జరుగుతుందన్నారు. అంతకు ముందు వాలిబాల్ టీం క్రీడాకారులను పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించి క్రీడాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పిఇటిలు నవీన్, దేవరాజు, ఉపాధ్యాయులు ఇంద్రాసేనారెడ్డి, ఆకుల లక్ష్మణ్, ఉపెందర్, రవిందర్, టిఆర్‌ఎస్ నాయకులు ర్యాకం శ్రీరాములు పాల్గొన్నారు.

Comments

comments