Search
Saturday 22 September 2018
  • :
  • :

విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణించాలి

 Students should come in the field of technology

మన తెలంగాణ/మేడ్చల్  ః  విద్యార్థులు సా ంకేతిక రంగంలో రాణించాలని మంచి భవిష్యత్తు ఉంటుందని మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండలంలోని గు ండ్లపోచంపల్లి అనుబంధ గ్రామమైన మైసమ్మగూడ పరిధిలోని మల్లారెడ్డి మహిళా ఇం జనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే శనివా రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు నిరంతరం ప్రయత్నించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఐటి రంగంలో ఎన్నో పరిశ్రమలను ఆహ్వానిస్తుందని అందుకు తగిన నైపుణ్యంలో మీలో ఉం టే ఇక్కడే మంచి ఉద్యోగాలు లభిస్తాయని అ న్నారు. భవిష్యత్తులు విభిన్న సాంకేతిక నైపుణ్యాలను సాధించాలని అందుకు ప్రణాళిక బ ద్ధ్దంగా చదువుకోవాలని జెఎన్‌టియుహెచ్ రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య విద్యార్థులకు సూ చించారు. ఎంతో మంది విద్యార్థులు క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఉద్యోగాలు పొందటం అభినందనీయమని ఎంపి మల్లారెడ్డి, రిజిస్ట్రా ర్ యాదయ్యలు అభినందించారు. బిటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాధవీలతా, డీన్ రఘురామిరెడ్డి, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

comments