Home వికారాబాద్ అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన విద్యార్థులు

అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డెక్కిన విద్యార్థులు

Students Strike For Drinking Water And Power Cut problem

కుల్కచర్ల: తమకు త్రాగడానికి నీరులేని పరిస్థితి ఉన్నదని కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన జడ్పి బాలికల పాఠశాల విద్యార్థినీలు రొడ్డెక్కారు. అధికారుల నిర్లక్ష్యం  కారణంగా తాము త్రాగడానికి నీరులేక భోజన సమయంలో పాత్రలు కడగడానికి, తినడానికి ఇబ్బందికర పరిస్థితి ఎర్పడుతున్నదని కుల్కచర్ల పాలమూరు ప్రధాన చౌరస్థా పై బైఠాయించి నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఎవరో చేసిన తప్పిదాలకు, నిర్లక్ష్యానికి తాము ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని విద్యార్థినీలు రొడ్డెక్కడం పట్ల యువజన సంఘాల నాయకులు సైతం విద్యార్థినీలకు బాసటగా నిలిచి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటపాటుగా రొడ్డుపై బైఠాయించి విద్యుత్తుశాఖ మండల అధికారి రవిచందర్‌కు వినతిపత్రం ఇచ్చి తమ పాఠశాలకు విద్యుత్తును పునరుద్దరణ చేసి తమకు జరుగుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందించడం జరిగింది. సంఘటన స్థలానికి మండల విద్యాధికారి అబీబ్ అహ్మద్ చేరుకుని సంఘటన గూర్చి జిల్లా అధికారుల దృష్ఠికి సమస్యను తీసుకువెళ్ళడం జరుగుతుందని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.