Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

ఆర్‌ఆర్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థుల ఆందోళన

Students Strike In RRS Engineering College In Sangareddy

పటాన్ చెరు :మండల పరిధి ముత్తంగి ఆర్‌ఆర్‌ఎస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కాలేజి యాజమాన్యం గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని , దాంతో ఫ్యాకల్టీ క్లాసుకు రావడంలేదు,పాఠలు చెప్పడంలేదు. విద్యార్థుల తమ కాలేజి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మంగళవారం ఆందోళనకు దిగారు. విద్యార్థుల తల్లి దండ్రులు ,ఆందోళన చేస్తున్న విద్యార్తులు యాజమాన్యం మొఖం చాటేస్తు ఎటువంటి సమాదానం రాకపోవడంతో అసహానానికి గురై కాలేజీ అద్దాలను పగులగొట్టారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థుల సమస్యలను ఉన్నత విద్యాశాఖ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జెట్పీటీసీ మద్దతు
ఆందోళన చేస్తున్న ఆర్‌ఆర్ ఎస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్థానిక జెట్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌఖర్యాలు కలిగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. సుమారు రెండు వేల మంది ఇంజనీరింగ్ విద్యా ర్థులు చదువుతున్న కాలేజీ యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుస్తుంటే పట్టించు కోవడంలేదని ఆరోపించారు. వెంటనే సమస్యను పరిషరించాలని , లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Comments

comments