Home హైదరాబాద్ ‘మత్తు’లో విద్యార్థులు

‘మత్తు’లో విద్యార్థులు

సగ్లర్లకు టార్గెట్‌గా మారిన కళాశాలల విద్యార్థులు

వెలుగు చూస్తున్న వరుస ఘటనలు
మత్తులో వాహన ప్రమాదాలు, ఘర్షణలు, నేరాలు
ఫ్యాషన్‌గా మారిన అలవాటు
నగర శివారు కళాశాలల్లో పెరుగుతున్న విష సంస్కృతి
డ్రగ్స్ సరఫరా కోసం విద్యార్థులకు నైజీరియన్ల ఎర

Student

సిటీబ్యూరో: నగర విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వారికి ఇదో ఫ్యాషన్‌గా మారుతోంది. తోటి విద్యార్థుల బర్త్ డే పార్టీల ముసుగులో వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. తాజాగా నగర శివార్లలోని ఇబ్రహీంపట్నంలో గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులను గంజాయి కేసులో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కొకైన్, గంజాయి తదితర మత్తు పదార్థాలను నగరంలో సరఫరా చేసేందుకు స్మగ్లర్లు విద్యార్థులను టార్గెట్ చేసుకున్నారు. విద్యార్థుల ద్వారా వీటిని సరఫరా చేయడం ద్వారా పోలీసులకు అనుమానం రాకపోవడం, మరోపక్క ఆదాయం కూడా పెంచుకోవచ్చనేది డ్రగ్స్ స్మగ్లర్ల ఎత్తుగడ.

ఈ క్రమంలోనే నగర శివార్లలో ఉన్న వందలాది ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యా ర్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, నగర పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏడాదిలో డ్రగ్స్ కేసులో సుమారు 50కి పైగా విద్యార్థులు పట్టుబడ్డారు. పట్టుబడకుండా తిరుగుతున్న విద్యార్థులు వేలకుపైగానే ఉంటారని పోలీసుల అంచనా. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేయడంతో మత్తు మందుతో విద్యార్థులు చిక్కుతున్నారు. అయితే విద్యార్థులందరు డ్రగ్స్‌కు బాని సలైతే తమకు సమాచారం వచ్చేది కష్టమేనని పోలీసులు అంటు న్నారు. ఒకపక్క విద్యార్థులు, మరోపక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగులు ఏదో ఒక రకంగా మత్తుకు అలవాటు పడుతున్నారు. స్నేహితుడి బర్త్‌డే వేడుకలు, పెళ్లి వేడుకలు, పరీక్షలో పాస్ అయినా ఇలా ఏదో ఒక శుభకార్యానికైనా అందరు విద్యార్థులు కలవడం ఏదో ఒక రూపంలో మత్తును తీసుకుంటున్నారు. బ్యాచ్‌లర్ విద్యా ర్థులు అయితే తమ రూమ్‌లోనే స్నేహితులను పిలిపించుకుని మత్తులో తూగుతున్నారు.

ఈ క్రమంలోనే కొన్ని ఘర్షణలు చోటు చేసుకుని, విద్యార్థులు బలైన ఘటనలు కూడా గతంలో చోటుచేసు కున్నాయి. హుక్కా సెంటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్కూకర్ క్లబ్, క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలు, కళాశాల ఆవరణలోని టి స్టాల్స్ తదితర రకాలలో విద్యార్థులు మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్లు శివారు కళాశాల విద్యార్థులతో స్నేహం పెంచుకుంటున్నారు. పార్టీల పేరుతో విందులు చేసుకునే విద్యా ర్థులను ఎంచుకుని వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటు న్నాయి. శివారు కళాశాలల్లో రెండు నెలల వ్యవధిలో ఐదుసార్లు విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మత్తు పదార్థాలు తీసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురై మరణించిన ఘటనలు కూడా చోటుచేసు కున్నాయి. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా లెక్చరర్లు, తల్లిదండ్రులు నిరంతరం ఓ కంట కనిపెడుతుండాలని పోలీసులు సూచిస్తున్నారు.