Home తాజా వార్తలు జాబ్ మేళాను ఉపయోగించుకోవాలి: అంజనీ కుమార్

జాబ్ మేళాను ఉపయోగించుకోవాలి: అంజనీ కుమార్

Anjani-Kumarహైదరాబాద్: విద్యార్థులు జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. వెస్ట్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో శనివారం జాబ్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅథిదిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుందని, జాబ్ మేళాను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. జాబ్‌మేళా నిర్వహించేందుకు వెస్ట్‌జోన్ జాయింట్ సిపి ఎఆర్ శ్రీనివాస్, టిఎంఐ కంపెనీ బాగా కృషి చేశారని అన్నారు. నగరంలోని ప్రతి జోన్‌లో నాలుగేళ్ల నుంచి జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు.

విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మేళాకు 30 కంపెనీలు వచ్చాయని, కల్నల్ హరినాథ్, ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ సంస్థ అధ్యక్షులు ట్రైనింగ్ ఇచ్చారని అన్నారు. జాబ్ మేళాలో 400 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. సిటీజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జాబ్ మేళా ద్వారా 1000 నుంచి 1,500మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని అన్నారు. దేశంలో హైదరాబాద్ నగరం అన్నింట్లో ముందు ఉన్నదని తెలిపారు. దీంతో చాలా కొత్త కొత్త అవకాశాలు నగరం లభిస్తున్నాయని అన్నారు. నగరం దేశంలో అత్యంత భద్రమైన నగరం కావడంతో కంపెనీలు ఇక్కడికి వరుస కడుతున్నాయని అన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్, ఎసిపి కెఎస్ రావు, జూబ్లీ హిల్స్ ఇన్స్‌స్పెక్టర్ బాలకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Students Use Job Mela Says CP Anjani Kumar