Home తాజా వార్తలు కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

Students who are anointe with milk to KCR photo

చేవెళ్లరూరల్: రాష్ట్రంలో కొత్తగా మరో 119 గురుకుల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని ఊరెళ్ల శివారులో సాగర్ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన కులాల గురుకుల పాఠశాల (బురాన్‌పూర్, కొడంగల్) విద్యార్థులు శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య మాట్లాడుతూ… కెజిటూపిజి ఉచిత విద్య అమలులో భాగంగా సిఎం కెసిఆర్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. కొత్తగా గురుకులాలు ప్రారంభిస్తే ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వాతి, తాహేరాబేగం, మమత, మహేష్ తదితరులు పాల్గొన్నారు.