Home జాతీయ వార్తలు రెండో స్థానంలో భారత్ ..

రెండో స్థానంలో భారత్ ..

students

కోల్‌కతా:  అమెరికాలో చదువుకోవడానికి వెళ్లుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారని, మొత్తం విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య 1.86 లక్షలుగా ఉందని యూఎస్‌ కౌన్సిల్ జనరల్ వెల్లడించారు. అమెరికాకు వెళ్లే విద్యార్థుల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా,భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో అమెరికాలో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. అమెరికాలో మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య 17 శాతంగా ఉందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో ఆ సంఖ్యలో 86శాతం పెరుగుదల ఉందన్నారు. స్టూడెంట్ వీసాడే సందర్భంగా దేశవ్యాప్తంగా 4000 మంది విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానిలో భాగంగా 10మంది విద్యార్థులకు కోల్‌కతాలో వీసాలు అందించారు.