Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కోడిగుడ్లతో క్యాన్సర్‌కు చెక్!

Egg

గుడ్లను క్యాన్సర్‌ నివారణకు ఉపయోగించవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుడ్లు పెట్టే కోడి జన్యువుల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా క్యాన్సర్‌కు చెక్ పెట్టే గుడ్లను ఉత్పత్తి చేయవచ్చంటున్నారు. అదే గుడ్లను హెపటైసిస్, మల్లిపుల్ స్లెరోసిస్ వంటి వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగించవచ్చని జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్త యోమిరి షింబం తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఇంటర్ ఫెరాన్ బీటా రసాయనాన్ని ఈ ఎగ్స్‌లో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రసాయనం ఖరీదు చాలా ఎక్కువ. అదే కోడిగుడ్ల ద్వారా దీన్ని ఉత్పత్తి చేయగలిగితే అందరికీ అందుబాటులోకి వస్తుందంటున్నారు. ఇలాంటి గుడ్లు పెట్టడానికి కోళ్ల జన్యువును మార్పుచేయడంలో వారు ప్రయోగాత్మకంగా విజయం సాధించినట్లు వెల్లడించారు.

Study on how eggs prevent cancer.

Comments

comments