Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

స్టైలిష్ లుక్

Sudhir-Babu

నారా రోహిత్, సుధీర్‌బాబు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీరభోగవసంతరాయలు’. ఈ చిత్రంలోని సుధీర్‌బాబు ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో సుధీర్ ఎంతో సీరియస్ మూడ్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. శ్రియాశరణ్, శ్రీవిష్ణు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా… వీరి ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన వచ్చింది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెల్లన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, మనోజ్‌నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌ః ఎస్.వెంకట్, ఆర్ట్‌ః శ్రీకాంత్ రమిశెట్టి, ఎడిటర్‌ః శశాంక్ మాలి, యాక్షన్‌ః రామ్ సుంకర.

Comments

comments