Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్‌ఐ సతీమణి ప్రసవం

                  ASI

చిట్యాలః చిట్యాల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో స్థానిక  ఎస్సై రాదండి స్వామి సతీమణి నాగమణి పండంటి మగ బిడ్డకు గురువారం జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అనేక మార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అకస్మికంగా తనిఖీలు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి కూతురు ములుగులో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగిన విషయం తెలి సిందే.. అలాగే చిట్యాల సివిల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకునూరి మురళి సభా ర్టినేటర్(బంట్రోత్) శంకర్ కూతురును ఆసుపత్రి తీసుకువచ్చి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

నేడు చిట్యాల సెకెండ్ ఎస్సైగా పనిచేస్తున్న రాదంటి స్వా మి సతీమణీ నాగమణి పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ సం దర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిధులను ఖర్చు చేసి కార్పోరేట్ స్థాయిలో,ప్రవేట్ ఆసు పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు,సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు.

సూపరిండెంట్ రవీ ప్రవీణ్ రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై శ్రధ్ద చూపడంతో పాటు స్థానిక స్పీ కర్ సిరికొండ మధుసూదన చారి,కలెక్టర్ ఆకునూరి మురళి చొరవ వల్లనే చి ట్యాల సివిల్ ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తుందని అన్నారు. అనంతరం ఎస్సై రాదండి స్వామికి కేసిఆర్ కిట్టును అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రవీ ప్రవీన్ రెడ్డి,డాక్టర్ స్నిగ్దా సంస్కృతి,డాక్టర్ రామానుజం,డాక్టర్ తిరుపతి,ఫార్మసిస్టు మల్లికార్జున్,హెడ్ నర్సు రాణీ,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

comments