Home నల్లగొండ గొర్రెలు అమ్ముకుంటున్నారు?

గొర్రెలు అమ్ముకుంటున్నారు?

Subcidy Sheeps Selling In Nalgonda District

మన తెలంగాణ/దామరచర్ల: దామరచర్ల మండల పరిధిలోని వాడపల్లి సరిహద్దు చెక్ పోస్ట్ గురువారం రాత్రి సిరిసిల్ల నుండి గుం టూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని లోయ పల్లికి తరలిస్తున్న 122 గొర్రెలను విశ్వస నీయ సమాచారం మేరకు పోలీసులు పట్టు కున్నారు. పట్టుకున్న గొర్రెలలో 111 గొర్రెలు ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన సబ్సిడీ గొర్రెలుగా మండల పశువైద్యాధికారి తేల్చా రు. గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న లారీ డ్రైవర్ గుజ్జల సంజీవరెడ్డిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై నగేష్ తెలి పాడు. ఇదిలా ఉంటే గత సంవత్సరం అక్టో బర్ 28 అర్థరాత్రి, 29 తెల్లవారు జామున 4 వాహనాలలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని పలు మండలాలకు చెందిన గొర్రె లను అక్రమంగా ఆంధ్రాప్రాంతానికి తరలి స్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, రెవిన్యూ సిబ్బంది పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని గ్రామాలకు చెందిన 99 గొర్రెలు, నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని గ్రా మాలకు చెందిన 21 గొర్రెలు, దామరచర్ల మండల పరిధిలోని ఇర్కిగూడెం గ్రామానికి చెందిన 17 గొర్రెలను మూడు వేర్వేరు వాహ నాలలో ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తుండగా వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పట్టు కున్నారు. 29 తెల్లవారు జామున సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని గ్రామాలకు చెం దిన 33గొర్లను మరో వాహనంలో ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తుండగా వాడపల్లి సరి హ ద్దు చెక్‌పోస్ట్ వద్ద పట్టుకుని మండల పశు వైద్యాధికారి సమక్షంలో విచారణ నిర్వహి ంచారు. పట్టుబడిన గొర్రెలు అన్నీ కూడా ప్రభుత్వం యాదవులకు పంపిణీచేసిన సబ్సిడీ గొర్రెలేనని విచారణలో తేల్చారు. సబ్సిడీపై వచ్చిన గొర్రెలను అమ్మితే కేసులు నమోదు చేస్తామని, గొర్రెలు అమ్మినవారిని, అక్రమం గా తరలిస్తున్న వారిని ఎస్సై నగేష్ హెచ్చరిం చారు. పట్టుబడిన గొర్రెలను ఎవరెవరు అ మ్మారో, వారి వివరాలను సేకరించి, రెవె న్యూ, పోలీసులు, పవువైద్యాధికారి ఆధ్వర్యం లో లబ్ధిదారులకు అందజేస్తారన్నారు.
ప్రభుత్వ పథకాలకు తూట్లు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా యాదవు లకు లబ్ధి చేకూర్చేందకు చేపట్టిన గొర్రెల పంపి ణీ పథకాన్ని పథకం ప్రకారం కొందరు లబ్ధిదారులు తూట్లుపొడు స్తున్న ట్లు ప్రజలు ఆరోపిస్తు న్నారు. సబ్సిడీపై వచ్చిన గొర్రెలను సాదుకుని ఆర్థిక ంగా బలోపేతం కావాలని, వాటి సంతతి వృద్ది చేయాలని ప్రభుత్వం భావిస్తే కొంతమంది ఏకంగా ఇచ్చిన గొర్రె లను విక్రయించడం క్షమిం చరాని విషయ మ ని ప్రజలు అంటున్నారు. లక్షల విలువ చేసే గొర్రెలను ఇంత పెద్ద మొత్తంలో అక్ర మంగా తరలిస్తుండడం వల్ల ప్రభుత్వ లక్షం నీరుగారిపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికా రుల పర్యవేక్షణ సరిగా లేదని, లబ్ధిదారులకు అవ గాహన సదస్సులు సరిగా నిర్వహించ కపో వడం కూడా ఒక కారణమని భావి స్తున్నారు. ప్రభుత్వం ఇచ్చి న గొర్రెలను వృద్ధిచేయకు ండా అమ్మి నా, కొన్నా కఠిన చర్యలుంటా యని తెలియపర్చక పోవడం మరో కారణం. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటా రని మిగతా యాదవులు ఎదురు చూస్తు న్నారు. ఎలాంటి చర్యలు లేకపోతే మిగతా లబ్ధిదారులు కూడా అదే దారిలో పయనించే అవకాశాలున్నాయి. అధి కారుల స్పంధించి లబ్ధిదారులకు ఇచ్చిన గొర్రెలను సాదుకునేలా తగు చర్యలు తీసుకోవాలి.