Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జలాంతర్గామి శకలాలు బయటపడ్డాయి

waterక్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన అతిపురాతన జలాంతర్గామి మిస్టరీ బయటపడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన ఆస్ట్రేలియా దేశనికి చెందిన తొలి జలాంతర్గామి శకలాలను 103 సంవత్సరాల తర్వాత గుర్తించారు. 1914 సెప్టెంబర్ 14న న్యూగునియా ద్వీప సమీపంలో ప్రయాణిస్తుండగా ఈ జలాంతర్గామి మునిగిపోయింది. ఆ సమయంలో అందులో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్, బ్రిటన్ దేశాలకు చెందిన 35 మంది సిబ్బంది ఉన్నారు. ఈ జలాంతర్గామి కోసం కొన్ని సంవత్సారల పాటు గాలింపులు చేపట్టినా ఫలితం లేకపోయింది. అయితే రాయల్ ఆస్ట్రేలియా నేవీ పోగొట్టుకున్న తొలి జలాంతర్గామి ఇదే. ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి మరిసే పెయిన్ ఈ జలాంతర్గామి శకలాలను గుర్తించారు. న్యూగునియా ద్వీప సమీపంలో 300 మీటర్ల లోతులో ఉన్న ఈ జలాంతర్గామి శకలాలను గుర్తించమని ఆయన తెలిపారు. గతవారం నెదర్లాండ్స్‌కి సంబందించిన సర్వే నౌకతో గాలింపులు చేపట్టడంతో శకలాలను గుర్తించమని పేర్కొన్నారు.

Comments

comments