Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

‘ప్రధాని వైద్య పరీక్షలు చేయించుకోవాలి’

Subramanian Swamy said that PM Modi should get himself medically Tested

న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామానికి మోడీ తొలుత నిర్ఘాంత పోయినా ఆ తర్వాత తేరుకుని వెళ్లిపోతున్న రాహుల్‌ను వెనక్కి పిలిచి .. కరచాలనం చేసి ఆయన భుజం తట్టారు. ఈ ఘటనతో మొదట సభలోని సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో ఈ ఘటనపై స్పందించారు. మోడీ వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రధానికి ఇబ్బంది కలిగేలా రాహుల్ ప్రవర్తించారని స్వామి పేర్కొన్నారు. ముమ్మాటికీ ఇది అనైతిక చర్య అని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్వామి సూచించారు.

Comments

comments