Home నిర్మల్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పట్టివేత

సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పట్టివేత

gasమన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వినియోగించుకుంటున్న దుకాణాలపై ఎన్స్‌ఫోర్ట్‌మెంట్ అధికారులు శనివారం మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఎఎస్‌ఒ వాహెద్ ఆధ్వర్యంలో డిటిలు రెండు బృందాలుగా ఏర్పడి పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా, బుధవార్‌పేట్, గాంధీచౌక్, కొత్త బస్‌స్టాండ్, ఈదగాం చౌరస్తాతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉదయం 6గం॥ నుండి 10 గం॥ల వరకు అధికారులు వ్యాపార దుకాణాలను తనిఖీ చేసి మొత్తం 70 సిలిండర్లును స్వాధీనం చేసుకున్నారు. యజమానులపై 6ఏ కేసును నమోదు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. వ్యాపార దుకాణాలు, గృహ వినియోగదారుడికి సంబంధించిన సబ్సిడీ సిలిండర్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటిలు శ్రీధర్, సత్యనారాయణ, కవిత, ఏజాస్‌అహ్మాద్, మహ్మద్ రహిమొద్దిన్ పాల్గొన్నారు.