Search
Monday 24 September 2018
  • :
  • :

పండ్ల తోటల పెంపకానికి ‘సబ్సిడీ’ ప్రోత్సాహం

'Subsidy' promotion of fruit plantation

సబ్సిడీ ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఎంఐడిహెచ్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై అవగాహన కరువు 

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : ఉద్యానవన అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ చాలామంది రైతులకు వాటిపై అవగాహన లేక పండ్ల తోటల పెంపకానికి దూరమవుతున్నారు. వివిధ కూరగాయల పంటలకూ సబ్సిడీ ఇస్తున్నా సద్వినియోగం చేసుకోవడం లేదు. యంత్రాలు, మల్చీషీట్లు కూడా అందజేస్తున్నారు. సబ్సిడీ కింద మొక్కలు, పాలీహౌజు కింద పెంచిన నారు ఇస్తున్నా రైతులకు అవగాహనలేమి కారణంగా దూరమవుతున్నారు. ప్ర స్తుతం కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఆయా శాఖలు ప్రజల వద్దకే వచ్చాయి. అధికారులు ప్రభుత్వ పథకాలపై వివరిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తు తం వికారాబాద్ జిల్లాలో మిషన్ ఫర్ ఇంటిగ్రెడెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడిహెచ్) కింద పండ్ల తోటల పెంపకానికి ప్రభు త్వం ప్రోత్సాహం అందజేస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.

జిల్లాలో ఈ పథకం కింద 66 హెక్టార్లలో మామిడి, 27 హెక్టార్లలో జామ, 15 హెక్టార్లలో ఆపిల్‌బేర్, 8 హెక్టార్లలో దానిమ్మ, 10 హెక్టార్లలో నిమ్మజాతి తోటలు, 45 హెక్టార్లలో బత్తాయి, నిమ్మ, రెండు హెక్టార్లలో అంజీర్ తోటల పెంపకానికి 40 శాతం సబ్సిడీ అందజేస్తున్నది. రైతులు ఎక్కడైనా ఆయా మొక్కలు కొనుగోలు చేసి పెంపకం చేపడితే వారికి సబ్సిడీ డబ్బు అందజేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో అంజీర్ మినహాయించి మిగిలిన పండ్ల తోటలను అక్కడక్కడ పెంచుతున్నారు. పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో నారాయణరెడ్డి అనే రైతు ఆపిల్‌బేర్ పండ్ల తోటలను ప్రవేశపెట్టారు. అనుకున్నంత లాభాలు రాకున్నా ఆసక్తి కనబర్చుతున్నారు. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న రైతులు రిలయన్స్ సంస్థకు పండ్లను విక్రయించి మంచి లాభాలు ఆర్జించారు. వాటితో పాటు పాలీహౌజుల్లో పెంచిన కూరగాయల నారును సబ్సిడీపై అందజేస్తున్నారు.

రూ.1600 డిడిలు చెల్లిస్తే 8 వేల మొక్కలు పంపి ణీ చేయనున్నారు. అందులో టమాటా, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చీ ఉన్నాయి. ప్రతి మొక్కకు ఇరవై పైస ల చొప్పున చెల్లించనున్నారు. జిల్లాలో 78 హెక్టార్లలో మల్చీషీట్లను 50 శాతం సబ్సిడీ కింద అందజేస్తున్నారు. హెక్టారుకు రూ.32 వేల ధర ఉండగా రూ.16 వేల సబ్సిడీ ఇవ్వనుఆన్నరు. తోటల కత్తిరింపు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 115 యూనిట్లు వచ్చా యి. వాటిని 50 శాతం సబ్సిడీ కింద అందజేస్తారు. ఒక్కో యంత్రం ధర రూ.5600 ఉండగా సబ్సిడీ రూ.2800 ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవివై) కింద తీగజాతి పందిళ్లకు 300 యూనిట్లు అందజేయనున్నారు. ఎకరాకు రూ.లక్షా ఆరు వేలు పలికే పందిళ్లను రూ.50 వేలకు అందించనున్నారు.

టామాటా పండించే రైతులకు 800 ప్లాస్టిక్ ట్రేలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి బాక్స్ ధర రూ.240 ఉం డగా 50 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. అయితే, ప్రతి మండలానికి ఐదుగురు రైతులకు, 40 బాక్సులకే పరిమితం చేశారు. ఎస్సీ రైతులకు వంద శాతం సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్ల ర్లు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 400 హెక్టార్లలో వీటిని అమర్చేందుకు పరికరాలు అందుబాటులో ఉ న్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిజేసే సబ్సిడీ పథకం కా వడం గమనార్హం. ఇలా అనేక పథకాలు ఉన్నా రైతులకు అవగాహన లేకపోవడం వల్ల సద్వినియోగం కావడం లేదు.

రైతులు నేరుగా సంప్రదించాలి : నీరజాగాంధీ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను రై తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారిణి నీరజాగాం ధీ సూచించారు. పండ్ల తోట లు, కూరగాయలు పండిం చే రైతులు నేరుగా తమను సంప్రదించాలని కోరారు. అనుకూలమైన నేలల్లో వాటి ని పండించి మంచి లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు. యూనిట్లు, పరికరాలు సబ్సిడీపై అందజేస్తామన్నారు. కూరగాయల పంటలపైనే కాకుండా పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి చూపించాలని అన్నారు. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా వాటిని పండించి అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని ఉద్ఘాటించారు.

Comments

comments