Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సోషల్ వెల్ఫర్ గురుకులంలో కంట్రోల్ బియ్యం

Subsidy Rice Distribute In Gurukula School In Mahabubabad

మరిపెడ ః మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫర్ గురుకుల పాఠశాల్లో విద్యార్థులకు కంట్రోల్ బియ్యం వండి పెడుతున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. వివరాల ప్రకారం కురుకుల పాఠశాల్లో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పౌషికాహారం అందించడం కోసం సన్న బియ్యం పంపిణి చేస్తుంది. ఇది ఆసరాగా చేసుకున్న పంపిణి నిర్వహకులు సన్న బియ్యంకు బదులు కంట్రోల్ బియ్యం(దొడ్డు బియ్యం) పంపిణి చేసి విద్యార్థులకు దొడ్డు బియ్యం అన్నం వండి పెడుతున్నారని విద్యార్థుల తల్లి దండ్రుల కమిటి సభ్యులు ఎడెల్లి వెంకన్న, ఎడెల్లి చంద్రశేఖర్‌లు ఆరోపించారు. ప్రతి రెండవ శనివారం ఫేరెండ్స్ కమిటి సమావేశం జరుగుతుంది. అయితే శనివారం సమావేశానికి వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల బోజనం, పప్పులు, శనిగలను పరిశీలించారు. పురుగులు పట్టి కుళ్ళి పోయి రంద్రాలు పడి ఉన్న వేరుశనిగలు ఉన్నాయని, విద్యార్థులకు కంట్రోల్ బియ్యాన్ని రిసైక్లింగ్ చేసి పిల్లలకు అన్నం వడ్డిస్తున్నారని, అలాగే పప్పులో మొత్తం పురుగులు, రాళ్ళు ఉన్నాయని వారు ఆరోపించారు. ఇట్టి విషయంపై కళాశాల ప్రిన్స్‌పాల్ దృష్టికి తీసుకువెళ్ళగా కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, సరుకులను విద్యార్థులకు పెడుతున్నామని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, దొడ్డు బియ్యం మిల్లర్లల్లో రిసైక్లింగ్ చేసిన బియ్యం పంపిణి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నాణ్యమైన బియ్యం అందిస్తున్నా పంపిణి నిర్వహకులు అట్టి బియ్యాన్ని పక్కదారి పట్టించి కంట్రోల్ బియ్యం పంపిణి చేస్తున్నారని అదికారులు స్పందించి చర్యలు చేపట్టాలని లేకుంటే విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఫేరెండ్స్ కమిటి సభ్యులు హెచ్చరించారు. ఇట్టి విషయంపై మన తెలంగాణ ప్రిన్స్‌పాల్ నాగరాజుని వివరణ కోరగా గోదాం ద్వారా వచ్చిన బియ్యం వండి పెడుతున్నామని తెలిపారు.

Comments

comments