Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సబ్సిడీపై నాటు కోడి పిల్లలు

                        Hen

హైదరాబాద్ :  నాటుకోళ్లు పెంచాలనుకునేవారికి ప్రభుత్వమే సబ్సి డీ కింద నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఒక లబ్ధిదారుడికి  నెల రోజులు వయసు ఉన్న 45 కోడి పిల్లలను పంపిణీ  చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో 20, రెండో విడతలో 25 పిల్లలను అందజేస్తారు.   కోడి పిల్లలను పెంచడానికి ఒక బోనును సైతం సబ్సిడీ కింద రైతులకు ఇవ్వనున్నారు. ఒక యూనిట్ ధర రూ. 4560 కాగా రైతులు రూ. 810 చెల్లిస్తే నాటు కోడి పిల్లలను తీసుకోవచ్చు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధికారులను రైతులు సంప్రదిస్తే అన్ని వివరాలు తెలియజేస్తారు.

Comments

comments