Home వార్తలు సక్సెస్‌ఫుల్‌గా ‘కృష్ణాష్టమి’

సక్సెస్‌ఫుల్‌గా ‘కృష్ణాష్టమి’

krishnashtamiశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సునీల్, నిక్కీ గల్రాని, డింపుల్ చోపడే హీరోహీరోయిన్లుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “కృష్ణాష్టమి విడుదలైన అన్ని చోట్ల ప్రతి కలెక్షన్లను సాధిస్తోంది. సునీల్ సినిమాను తన భుజాలపై మోసి సక్సెస్ క్రెడిట్‌ను సొంతం చేసుకున్నాడు. నిక్కీ క్లాస్ యాంగిల్, డింపుల్ మాస్ యాంగిల్ ప్రేక్షకులకు బాగా నచ్చింది”అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ “దిల్‌రాజు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాలో నన్ను ఎంతో కొత్తగా చూపించారు. సినిమాను ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులు ఎంతో బాగా ఆదరిస్తున్నారు”అని చెప్పారు. దర్శకుడు వాసువర్మ మాట్లాడుతూ “మాస్, క్లాస్ అనే తేడా లేకుండా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా విడుదలై ఐదు రోజులవుతున్నా కలెక్షన్స్ అదేవిధంగా కొనసాగుతుండడంతో ఎంతో సంతోషంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిక్కీ గల్రాని, డింపుల్ చోపడే, హన్సిక్ పాల్గొన్నారు.