Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయండి

cong*డిసిసి అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో ప్రతీ ఒకరు పాల్గొని విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన పోరాటంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తం కుమార్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన యాత్ర మంగళవారం నిర్మల్ చేరుకుంటుందన్నారు.ఈ యాత్ర నిర్మల్ జిల్లా సోన్ మండలం వద్ద ఘన స్వాగతం పలికి అక్కడ నుండి నిర్మల్ వరకు యాత్ర కొనసాగిస్తామన్నారు.స్థానిక ఎన్‌టిఆర్ మినీ స్డేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పోరాటంగా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. నిర్మల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్‌ఎస్ పార్టీపై వ్యతిరేకంగా పోరాడే ప్రతీ ఒకరు ఈ యాత్రలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో పలువురి చేరిక
ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని ఈదిగాం, శాంతినగర్ కాలనీలకు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమణరెడ్డి, చంద్రకాంత్, చిన్ను, పద్మాకర్, సంతోష్, మహేష్,హైదర్, దినేష్, యూనుస్, సుధాకర్, అక్బర్, అజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments