ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఒక్కసారి నెగిటివ్ ఆలోచనలు మదిలోకి వచ్చాయంటే తప్పించుకోవడం చాలా కష్టం అంటున్నారు మానసిక నిపుణలు. నెగిటివ్గా ఆలోచించేవారికి ఏది చూసినా తప్పుగానే అనిపిస్తుంది. ఇలాంటప్పుడే సానుకూలంగా ఆలోచించడం అవసరం. అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి విజయాన్ని చవి చూసారంటే చాలు అనుకూల దృక్పథానికి అలవాటుపడటం ఖాయం. అలా కాకుండా నేనిలాగే ఉంటాను అనుకుంటే నష్టపడతారు.
–ప్రతికూల ఆలోచనలతో ఉన్నప్పుడు ఆఫీసులోనో, ఇంట్లోనో ఎవరైనా మన మీద కోప్పడితే, వెంటనే తిరిగి కోప్పడటం వల్ల నష్టమే కదా. అలాంటప్పుడు నిదానంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. నెగిటివ్గా కాకుండా వాళ్లెందుకలా ప్రవర్తించారో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
–మీలో మీకు నచ్చే విషయాలు కొన్నుంటాయి. అవేంటో ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి. మీలో ఉన్న మంచి గుణాలు మీకు ఎంతో ధైర్యాన్నిస్తాయి. మీ స్నేహితులు, బంధువుల కష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. వెంటనే మీరే బెటరన్న స్ఫురణకు వచ్చి సానుకూలంగా ఆలోచించడం మొదలుపెడతారు.-అందిపుచ్చుకుంటే అవకాశాలకు కొదవుండదు. ఒకసారి ఓటమి పాలైతే కొంపమునిగిపోయిందేమీ లేదు. తిరిగి మరోసారి ప్రయత్నించండి.
–మీకిష్టమైన అభిరుచిని బయటకు తీయండి. పెయింటింగ్, పుస్తకాలు చదవడం, పాటలు వినడం, డాన్స్లాంటివి ప్రారంభించండి. ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. మీలో వచ్చే మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు.