Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గురుకులాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

Successfully pass in 100 percent of gurukulam Schools

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు మనస్ఫూర్తితో ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌తో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల వారీగా గత సంవత్సరం 10వ తరగతిలో సాధించిన ఉత్తీర్ణత శాతంపై సమీక్షించి తక్కువ ఉత్తీర్ణతకు కారణాలు తెలుసుకుని ఈ విద్యాసంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చూడాలని వందశాతం పలితాలు సాధించాలని సూచించారు. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18 ఆశ్రమ, 12 గురుకుల పాఠశాలలు వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ద్వారా 3జ్యోతిబా పూలే ఆశ్రమ పాఠవాలలు, మైనార్టీ ఆశ్రమ పాఠశాలలు 3 ఉన్నాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగించకూడదని విరివిగా మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని కలెక్టర్ తెలిపారు. బిసి సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఎసి, ఎస్‌టి మైనార్టీ సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఏర్పాటుచేయాలన్నారు. హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్ళు స్థానికంగా ఉంటూ, సమయపాలన పాటిస్తూ విద్యార్ధులకు ఆదర్శంగా ఉంటూ పాఠశాలలు నిర్వహించాన్నారు, తాను ఆకస్మికంగా సందర్శిస్తానని, అననుమతి లేకుండా గైర్హాజరైతే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్ధులకు అందిస్తున్న మెనుతోపాటు సంబంధిత డాక్టర్, పోలీస్, వార్డెన్ మొబైల్ నెంబర్లు అందరికీ కనపడేలా గోడపై రాయించాలన్నారు. అంకితభావంతో స్వంత పిల్లల్లా విద్యార్ధులను సూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ సంఘటన జరిగినా ప్రధానోపాధ్యాయులే బాధ్యులని నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. 10వ తరగతి గణితంలో దంతాలపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్ధులు అందరూ విఫలం అవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది పునరావృతం కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేక తరగతులు నిర్వహించి శ్రద్ద తీసుకోవాలన్నారు. జెసి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్లు ఇచ్చిన సాంపుల్స్ ప్రకారం నాణ్యత గల సరుకులను మాత్రమే తీసుకోవాలని, నాణ్యతలో, తూకంలో తక్కువ ఉండే సరుకులను త్రిప్పి పంపాలని ఆయన చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో అవసరం మేరకు గ్యాస్ సిలెండర్లు, పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌టి, బిసి, మైనారిటీ సంక్షేమ అధికారలు నారాయణస్వామి, ఇందిరా శ్రీనివాసరావు, డిసిఎస్‌ఓ నర్సింగ్‌రావు, సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపాల్స్, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments