Home వార్తలు ముచ్చటగా మూడోసారి

ముచ్చటగా మూడోసారి

ntr-puriఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌తో కలిసి మరోసారి పనిచేయాలని ఎన్టీఆర్ నిశ్చయించుకున్నట్లు తెలిసింది. ఇక ఎన్టీఆర్-పూరీ కాంబినేషన్‌లో ఆంధ్రావాలా, టెంపర్ చిత్రాలు వచ్చాయి. వీటిలో టెంపర్ పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కనుంది. ఇక రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ముందుగా సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నాడు. ఈ చిత్రంతో వక్కంతం వంశీ డైరెక్టర్‌గా పరిచయం కావాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు పూరీ చిత్రానికి సైన్ చేశాడని తెలిసింది. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో కొత్త చిత్రం ఓకే అయిందని సమాచారం. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. కళ్యాణ్‌రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ లేదా బివిఎస్‌ఎన్ ప్రసాద్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్-పూరీల కొత్త చిత్రం వచ్చే నెల ప్రారంభంకానున్నట్లు సమాచారం.