Home ఖమ్మం వారసత్వ లొల్లి

వారసత్వ లొల్లి

సింగరేణి వ్యాప్తంగా మ్యారేజ్ బ్రోకర్లు
కొడుకులు, అళ్లుళ్ల మధ్య పెరుగుతున్న పోటీలు
తల్లిదండ్రులపై ఒత్తిళ్లు తెస్తున్న కూతుర్లు
అధిక ధర పలుకుతున్న వారసత్వ ఉద్యోగాలు
జనవరి 1 నుండి డిపెండెంట్ల దరఖాస్తుల స్వీకరణ

Collieries1భద్రాద్రి కోత్తగూడెం : సింగరేణితో ముడిపడి ఉన్న భద్రాద్రి కోత్తగూడె జిల్లాలో వారసత్వ ఉద్యోగాలు లోల్లి మోదలైంది. డిపెండెంట్ ఉద్యోగం పోందేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా 2017 జనవరి 1వ తేది నుండి ఉద్యోగార్హుల దరఖాస్తులను సింగరేణి యాజమాన్యం స్వీకరించనుండటంతో కోత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, కోయగూడెం ఏరియాల్లో సందడి వాతావరణం నెలకోంది. సుమారు 18 ఏళ్ల అనంతరం వారసత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో ఆశావాహలు ఉవ్వీళ్ళూరుతున్నారు.

పెళ్లిళ్ల పేరయ్యల హడావిడి :
జిల్లాలోని సింగరేణి ప్రాంతాల్లో పెళ్లిళ్ల పేరయ్యల హడావిడి పెరిగిపోయింది. కోడుకులకు ఉద్యోగాలు పోందే అర్హత దక్కడంతో వారికి పిల్లను చూసే పని
బ్రోకర్లు నెత్తినేసుకుంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సింగరేణి నివాస గృహాల్లో బ్రోకర్ల రాకపోకలు పెరిగినట్లు తెలుస్తోంది. ఫలానా ప్రాంతంలో అమ్మాయి ఉందీ… ఆమె గుణవతి, రూపవతి అంటూ రంగురంగుల ఫోటోలూ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క కోడుకులు లేని తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసిన ఇల్లరికం తెచ్చుకుని వారకత్వ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. పిల్లలు లేనివారు తమ్ముళ్లు తదితరులకు ఇచ్చేందుకుకూడా సన్నాహాలు సాగుతున్నాయి.
తల్లి దండ్రులపై పెరిగిన ఒత్తిళ్లు :
సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే పెళ్లిలైన వారు తల్లిదండ్రులపై ఓత్తిళ్ల పర్వం సాగుతోంది. మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే తమకు కల్పించాలని పోటీలు పడుతున్నారు. ఇప్పటికే కోడుకులు ఎదో ఓక ఉద్యోగంలో స్థిరపడి ఉండటంతో అల్లుడికి ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలని కూతుర్లు పట్టుపడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవసరమైతే అందుకు ఎంతో కోంత ముట్టచెప్పేందుకు కూడా సిద్ధపడుతున్నారు. దీంతో ఏమి చేయాలో అర్థంకాక ఆయా కుటుంబాల్లో తలలు పట్టుకుంటున్నారు.

బేరసారాలు:
సింగరేణి ఉద్యోగాల బేర సారాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వారసులు లేని వారు, అళ్ళుళ్ళకు, వారు కూడా లేని వారు తమ్ముళ్లకు ఉద్యోగాలు అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బులు ఆశిస్తున్నటు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓక్కో ఉద్యోగానికి రూ.30 లక్షలు ఆ పే మాటే అనే చర్చ సాగుతోంది. అంత మోత్తం ముట్ట చెప్పినప్పటికీ నెలనెలా అందుకునే జీతంలో నుంచి కోంతమోత్తం అప్పజెప్పే సంధి కూడా కుదురుస్తున్నట్లు పలువురు అంటున్నారు.

జనవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరణ :
వారసత్వ ఉద్యోగాలకు 2017 జనవరి నుంచి దరఖాస్తులు స్వీకరించన్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగాల సందడి నెలకోంది. దరఖాస్తులు పూరించే విధానం. ఎలా పూరించాలి, దరఖాస్తునకు జతచేయాల్సిన పత్రాలు ఏంటీ అనేదానిపై చర్చించుకుని ఆ దిశగా అప్లికేషన్లు నింపుకుంటున్నారు.