Home వరంగల్ రూరల్ అనిశా వరంగల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్‌గా సుదర్శన్

అనిశా వరంగల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్‌గా సుదర్శన్

dig

మన తెలంగాణ/వరంగల్ క్రైం : అవినీతి నిరోధక శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్‌గా(ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్) బాధ్యతలు స్వీకరించిన తాళ్లపెల్లి సుదర్శన్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గతంలో కరీంనగర్ జిల్లా అనిశా విభాగంలో డిఎస్పిగా విధులు నిర్వహించిన సుదర్శన్‌కు అదనపు ఎస్పిగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించడంతో పాటు, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అనిశా విభాగాన్ని జోన్లగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గతంలో అనిశా డిఎస్పిగా చక్కగా రాణించడంతో సుదర్శన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అనిశా వరంగల్ జోన్ డిడి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా అశిశా డిడి పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన ఈ విభాగం పనితీరుపై ఎసిడి డిడి పోలీస్ కమిషనర్‌కు వివరించారు. పోలీస్ కమిషనర్‌ను కలిసిన వారిలో ఎసిపి ఇన్స్‌పెక్టర్లు వి.క్రాంతికుమార్, పి.వెంకట్ ఉన్నారు.