Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అభిమాని మృతి… కంట‌త‌డి పెట్టిన హీరో..!

Hero-sudeep

బెంగ‌ళూరుకి చెందిన వినూత అనే యువ‌తి కొంత కాలంగా క్యాన్య‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతోంది. ఈమెకి సుదీప్ అంటే అమితమైన ప్రేమ. సుదీప్‌ని ఎలాగైన క‌ల‌వాల‌ని ఒక్క‌సారి త‌న‌తో ఫోటో దిగాల‌ని ఆ యువ‌తికి చివరి కోరిక‌ుంది. మొన్న కార్తీ, నిన్న లారెన్స్‌, నేడు సుదీప్‌…. అభిమాని మృతితో వారు కంటత‌డి పెట్టారు. త‌మ‌ని ఎంత‌గానో ప్రేమించే అభిమాని మ‌ర‌ణించార‌నే వార్త‌ వాళ్లను ఎంత‌గానో క‌లచివేసింది. తన అభిమాన సంఘం స‌భ్యుల ద్వారా విష‌యం తెలుసుకున్న సుదీప్ ఓ రోజు జెపి న‌గరంలో ఉన్న త‌న ఇంటికి పిలిపించి మహిళకు ఆత్మస్థైర్యం అందించాడు. వ్యాధి గురించి అస్సలు ఆలోచించ‌వ‌ద్ద‌ని, ధైర్యంగా ఉండాల‌న్నాడు. వినూత‌తో క‌లిసి ఫోటో కూడా దిగాడు. అయితే క్యాన్స‌ర్ వ్యాధి తీవ్ర‌త చివ‌రి ద‌శ‌కు చేర‌డంతో  వినూత క‌న్నుమూసింది. ఈ విష‌య‌న్ని ఫ్యాన్స్ అసోసియేష‌న్ సోష‌ల్ మీడియా ద్వారా సుదీప్‌కి చేర‌వేశారు. విష‌యం తెలుసుకున్న సుదీప్ క‌న్నీరు పెట్టారు.

Comments

comments