Home జాతీయ వార్తలు టిటిడి మెంబర్‌గా సుధామూర్తి ప్రమాణం

టిటిడి మెంబర్‌గా సుధామూర్తి ప్రమాణం

Sudha Murthy Sworn as TTD Member on Monday

తిరుమల : టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఆమె చేత టిటిడి జెఇఒ శ్రీనివాసరాజు ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి, శేషవస్త్రాలతో సత్కరించారు. తనను టిటిడి సభ్యురాలిగా నియమించిన ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి ద్వారా ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Sudha Murthy Sworn as TTD Member on Monday